తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజీనామా..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్లు సమాచారం. కామారెడ్డి, గజ్వేల్ .. రెండు స్థానాల్లోనూ ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి , సిఎం కెసిఆర్, రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల మెజారిటీతో కెసిఆర్ పై విజయం సాధించారు.
రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు దక్కించుకోగా.. బిఆర్ ఎస్ పార్టీకి 30 స్థానాల్లో విజయం సాధించింది. మరో 9 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇంకా పలు నియోజక వర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది.