Results: తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలు విడుదల

ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): పాలిటెక్నిక్ చ‌దివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీఫార్మ‌సీ రెండో సంవ‌త్స‌రంలో చేరేందుకు రాసిన తెలంగాణ ఈసెట్ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఈసెట్‌లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయ‌న పేర్కొన్నారు.

  • ఈ నెల 3న జ‌రిగిన ఈ సెట్‌కు దాదాపు 24 వేల మంది విద్యార్థులు హాజ‌రయ్యారు. ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.
  • 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్…
  • 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
  • 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు
  • సెప్టెంబరు 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.
  • సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ ఉంటుంది.
  • సెప్టెంబ‌ర్ 13న తుది విడ‌త ప్ర‌వేశాల షెడ్యూలు ప్రారంభం.
  • సెప్టెంబ‌ర్ 14న తుది విడ‌త ద్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌
  • సెప్టెంబ‌ర్ 14,15వ తేదీల్లో ఆప్ష‌న్ల‌కు అవ‌కాశం.
  • సెప్టెంబ‌ర్ 17న తుది విడ‌త ఈ సెట్ సీట్ల‌ను కేటాయిస్తారు.
Leave A Reply

Your email address will not be published.