తెలంగాణ గాంధీ కెసిఆర్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ (CLiC2NEWS): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్వదినాన్ని పురస్కరించుకొని పాలకుర్తి నియోజక వర్గంలో పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణి చేశారు. అనంతరం దేవరుప్పుల్‌లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ గాంధీ అనిఅన్నారు. తెలంగాణ ప్రజల కలను నిజం చేసిన మహానుభావుడు కెసిఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు.
దేవరుప్పల్‌లో జరిగిన సంత్ సేవాలాల్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. సేవాలాలో చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. సమాజానికి నిజమైన సేవకుడు, అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికిన గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని , ఆయన బంజారా జాతికే కాదు యావత్ జాతికే ఆదర్శ పురుషుడయ్యారని అన్నారు.