Telangana Global summit: ప్రారంభ‌మైన `గ్లోబ‌ల్ స‌మ్మిట్`

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన `తెలంగాణ‌ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్` సోమ‌వారం ప్రారంభ‌మైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచ‌ర్ సిటీలో 100 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స‌ద‌స్సును గ‌వ‌ర్న‌ర్ జిష్న‌దేవ్ వ‌ర్మ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర మంత్రులు, సినీ న‌టుడు నాగార్జున‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు, వివిధ సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజర‌య్యారు. ఈ స‌ద‌స్సు ఇవాళ‌, రేపు (సోమ‌, మంగ‌ళ‌వారం) జ‌రుగ‌నుంది. ఈ స‌ద‌స్సులో 44 దేశాల‌కు చెందిన 154 మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ స‌ద‌స్సులో తెలంగాణ త‌ల్లి డిజిట‌ల్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. స‌ద‌స్సు ప్రారంభానికి ముందుగా ముఖ్య‌మంత్రి రేవంత్ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. స‌ద‌స్సును ప్ర‌భుత్వం కొత్త సాంకేతిక‌త‌ను జోడించి అత్యాధునిక హంగుల‌తో ఏర్పాట్లు చేసింది. దీనిని రాష్ట్రప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది.

Also Read: క‌వ్వించే అందాల‌తో.. Priyanka Chopara

Leave A Reply

Your email address will not be published.