దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆసరా పెన్షన్లను రూ. 4016 కు పెంచుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన పెన్షన్ జులై నెల నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుంది. పెన్షన్ల పెంపుపై రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.