రేష‌న్ డీల‌ర్ల‌కు గుడ్‌న్యూస్ తెలిపిన‌ రాష్ట్ర ప్ర‌భుత్వం

రేష‌న్ డీల‌ర్ల క‌మిష‌న్ పెంపు..

హైద‌రాబాద్ రాష్ట్ర ప్ర‌భుత్వం రేష‌న్ డీల‌ర్ల‌కు గుడ్‌న్యూస్ తెలిపింది. డీల‌ర్ల క‌మిష‌న్‌ను రెట్టింపు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో 17 వేల‌కు పైగా రేష‌న్ డీల‌ర్ల కుటుంబాల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మిష‌న్ ట‌న్నుకు రూ.700 ఉండ‌గా.. రూ. 1400 పెంచింది. దీంతో ప్ర‌భుత్వంపై ప్ర‌తి ఏటా రూ. 245 కోట్ల అధ‌న‌పు భారం ప‌డ‌నుంది. జెఎసి ప్ర‌తినిధుల‌కు క‌మిష‌న్ పెంపు జిఒను మంత్రి గంగుల క‌మలాక‌ర్ అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.