corona effect: విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగింపు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగించారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థ‌ల‌కు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు సెల‌వుల‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ మేర‌కు ఇవాళ (ఆదివారం) ఉత్వ‌ర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్ర‌క‌టించిన సంక్రాతి సెల‌వులు నేటితో ముగియ‌నున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో సెల‌వులు పొడిగించారు. ఈ క్ర‌మంలో విద్యాసంస్థ‌ల్లో కొంత‌కాలం ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌రాద‌ని వైద్యారోగ్య‌శాఖ సిఫార్సు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆరోగ్య‌శాఖ సిఫార్సు మేర‌కు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు సెల‌వుల‌ను పొడిగిస్తూ సిఎస్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.