Telangana: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల్లో రేపట్నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.