తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.. ఈ ఫలితాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.85 శాతం, సెకండ్ ఇయర్‌లో 67.26 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి వెల్లడించారు. ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఫస్టియర్ ఫలితా్లలో మేడ్చల్ జిల్లా.. రెండో సంవత్సరం ఫలితాల్లో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు మంత్రి వెల్లడించారు. కాగా జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించినట్లు తెలిపారు.