టెన్త్ విద్యార్హతతో జిల్లా కోర్టుల్లో కొలువులు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జిల్లాల కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జ్యుడీషియల్, మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపాదికన ఖాళీలను భర్తీ చేయడానికి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడో తరగతి నుండి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణలైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. పదోతరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అనర్హులని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని కోర్టులతోపాటు హైదరాబాద్‌లోని సిటి సివిల్ కోర్టులో ఉన్న ఖాళీలను.. మొత్తం 1,226 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 నుండి 34 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 11నుండి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టిక్కట్‌లను ఫిబ్రవరి 15వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మార్చి నెలలో పరీక్షను నిర్వహించనున్నట్లు సమాచారం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వూ తదితర అంశాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగంలో నెలకు వేతనం రూ. 19వేలు నుండి రూ. 58,850 వరకు చెల్లిస్తారు. వీటితోపాటు స్టెనో గ్రాఫర్లు, టైపిస్టులు, కాపీయిస్ట్‌ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
CLiC2NEWS_Leagal_news
Ok