తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

- పెద్దపెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
- నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5.51 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి 4.56 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
- వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
- మహబూబ్‌నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24 లక్షల మెజారిటీతో గెలుపొందారు.
- జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 45 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 85 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- నిజామాబాద్‌లో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వీంద్ 1.13 లక్షల కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 2.12 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
- ఆదిలాద్ లోక్ సభ నుంచి బిజెపి అబ్యర్థి గోడం నగేష్ 78 వేలకు పైగా ఓట్లతో భారీ మెజార్జీతో గెలుపొందారు.
- సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 50వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- హైదరాబాద్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి 3.25 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొదారు.
- మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై 3.8 లక్షలకు పైగా ఓట్ల మెజారిటి సాధించారు.