తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జులై 14 వ తేదీ నుండి ఎంసెట్ నిర్వహిచాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు జులై 14, 15వ తేదీన.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు జులై 18,19,20 వ తేదీల్లో ఎంసెట్ నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మే నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈసెట్‌ను జులై 13వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. దరఖాస్తు గడువు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలు కలిగిన నోటిఫికేషన్‌లు సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని తెలియజేశారు.