న‌ష్టాలు జాతికి.. లాభాలు దోస్తుల‌కు.. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై కెటిఆర్‌ఫైర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌ష్టాల‌ను జాతికి అంకితమిచ్చి.. లాభాల‌ను ప్రైవేటు దోస్తుల‌ప‌రం చేయ‌డ‌మే కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ్య‌మని బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి కెటిఆర్ ఫైరయ్యారు. ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల‌ను అమ్మేసి.. ప్రైవేటీక‌ర‌ణ చేస్తే దానివ్ల వ‌చ్చే న‌ష్టాలు, ప‌ర్య‌వ‌సానాలు ఏంట‌నేది సిఎం తెలిపారన్నారు. విద్యుత్ రంగంలో బిహెచ్ఈఎల్‌కు నేరుగా సిఎం ఆర్డ‌ర్లు ఇచ్చారు. ప్రైవేటు రంగానికి ఆర్డ‌ర్లు ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ఈ విధంగా చేశార‌న్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేస్తే.. వాటిలో ఉన్న రిజ‌ర్వేష‌న్లు ఏవిధంగా మాయ‌మైపోతాయి.. దీని ద్వారా ల‌క్ష‌లాది ద‌ళిత‌, గిరిజ‌న‌, బ‌ల‌హీన‌వ‌ర్గాల పిల్ల‌ల‌కు ఏవిధంగా అన్యాయం జ‌రుగుతుందో సిఎం చాలాసార్లు వివ‌రించార‌ని కెటిఆర్ తెలిపారు.

1 Comment
  1. acne almost overnight says

    OCB Oriental Bank Cash loan from VND 10 million to VND 200 million without proof of income,
    salary from VND 2 million can be borrowed.

Leave A Reply

Your email address will not be published.