పదిమందికి ఉపయోగపడే పనులుచేస్తేనే చిరస్థాయిగా గుర్తుండిపోతాం.. కెటిఆర్

నాగర్ కర్నూల్ (CLiC2NEWS): తిమ్మాజి పేటలో ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కెటిఆర్ , సబితా ఇంద్రారెడ్ఇ, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జనార్థన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. అందరం పుడతాం.. మన కాలపరిమితి ముగిశాక నిష్క్రమిస్తాం. పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తేనే చిరస్థాయిగా గుర్తుండిపోతాం.. ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి తను జన్మించిన ప్రాంతాన్ని మరిచిపోకుండా, పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నారు. కార్పొరేట్ స్కూల్స్ కంటే ఈ స్కూల్ బాగుందని, ఆధునాతన సదుపాయాలతో మంచి ప్లే గ్రౌండ్‌తో అద్భుతంగా ఉందని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.