గిరిజన బాలుర గురుకుల జూనియర్ కాలేజ్‌ని ప్రారంభించిన మంత్రి
నర్సంపేటలో త్వరలో గిరిజన మహిళా డిగ్రీ కాలేజీ మంజూరు

వరంగల్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ గురువారం నర్సంపేటలోని గిరిజన బాలుర గురుకుల జూనియర్ కాలేజ్‌ని ప్రారంభించారు. జడ్పి ఛైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిపి మంత్రి ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ది చెందాలంటే విద్య ఒక్కటే మార్గమని , రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలో కేజి నుండి పిజి వరకు నాణ్యమైన గురుకుల విద్య అందుబాటులో ఉందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చుతున్నామని తెలపారు. నర్సంపేటలో త్వరలో గిరిజన మహిళా డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు రూ. 12,304 కోట్లు బడ్జెట్ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్తిక సంవత్సారానికి రూ. 8,400 కోట్ల బడ్జెట్ కేటాయించడం దేశంలో ఉన్న గిరిజనుల పట్ల బిజెపి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి విమర్శించారు.