ఉపాధ్యాయులు ప్ర‌తి ఏటా ఆస్తుల వివ‌రాలు ప్ర‌క‌టించాల్సిందే!

పాఠ‌శాల విద్యాశాఖ కీల‌క ఉత్త‌ర్వులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో పాఠ‌శాల ఉపాధ్యాయుల ఆస్తుల‌పై పాఠ‌శాల విద్యాశాఖ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. విద్యాశాఖ ప‌రిధిలో ప‌నిచేసే ఉపాధ్యాయులు ప్ర‌తి సంవ‌త్స‌రం ఆస్తుల వివ‌రాలు ప్ర‌క‌టించాల‌ని ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. స్థిర‌, చ‌రాస్థుల క్ర‌య‌విక్ర‌యాల‌కు ముంద‌స్తు అనుమ‌తి తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొడ జిల్లా చందం పేట మండ‌లం గుంటిప‌ల్లి పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు మ‌హ‌మ్మ‌ద్ జావేద్ అలీ విధుల‌కు హాజ‌రుకాకుండా రాజ‌కీయ కార్య‌క‌లాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వ‌క్ఫ్ బోర్డు సెటిల్‌మెంట్ల‌లో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని 2021లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. విచార‌ణ జ‌రిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జావేద్ అలీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో చాలా వ‌ర‌కు నిజ‌మేన‌ని తేల్చింది. శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిఫార్స్ చేసింది. జావేద్ అలీపై చ‌ర్య‌ల‌తో పాటు పాఠ‌శాల విద్యాశాఖ ప‌రిధిలోని ఉద్యోగులంద‌రికీ సంబంధించి ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని గ‌త సంవ‌త్స‌రం ఏప్రిల్‌లో విజిలెన్స్ విభాగం సిఫార్స్ చేసింది. సిబ్బందికి బ‌యోమెట్రిక్ హాజ‌రు ఉండాల‌ని సూచించింది. ఈమేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 

 

Leave A Reply

Your email address will not be published.