ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ పాలసీలు ఉండాలి: సిఎం రేవంత్‌రెడ్డి

హైదారబాద్ (CLiC2NEWS): రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టిఎస్ ఐఐసిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతిని గురించి చర్చించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సిఎం అన్నారు.
వివిధ రంగాలకు సంబంధించి ఆరు నూతన పాలసీలు తయారు చేస్తున్నట్లు అధికారులు సిఎం కు తెలిపారు. ఎంఎస్ ఎంఇ, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జి, ఇవి పాలసీలకు సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు. టెక్స్ టైల్స్ రంగానికి సంబంధించి పవర్ లూమ్, హ్యాండ్‌లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీలను రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు.