తెలంగాణ‌: నేడు ప‌లు జిల్లాల్లో వాన‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో శుక్ర‌వారం భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌పెల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో తేలిక‌పాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.