TS: మైనారిటి గురుకులాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మైనారిటి గురుకులాల ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మైనారిటి గురుకులాల్లోని 5,6,7,8 తరగతులు, ఇంటర్ ప్రవేశాల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9వ తేదీన ఐదో తరగతి ప్రవేశ పరీక్ష, మే 10న 6,7,8 తరగతులకు ప్రవేశ పరీఓ నిర్వహించనున్నారు. మే 21వ తేదీన ఇంటర్ ప్రవేశ పరీక్ష జరగనుంది.