జర్నలిస్టులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్

హైదరాబాద్ (CLiC2NEWS): జర్నలిస్టుల కు టిఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ట్విట్టర్ లో పలువురు జర్నలిస్టుల చేసిన సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు బస్సు టికెట్ తీసుకునేందుకు ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునే అవకాశం ఉండేది.
తాజాగా ఎండి సజ్జనార్ టిఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం కల్పించారు . తాజాగా TSRTC వెబ్సైట్లో జర్నలిస్టు 2/3 కన్సెషన్ ఆప్షన్ను జోడించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సజ్జనార్.
Good NEWS for our NEWS friends! Now, #journalists with valid bus pass from #TSRTC can avail of concession online also while booking tickets through our #TSRTC website. Thank You @iAbhinayD & @NVNAGARJUNA for your suggestion
Patronage #TSRTC & #IchooseTSRTC #fridaymorning@V6News pic.twitter.com/7FEyzzBN99— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 12, 2021