Telangana: కామారెడ్డిలో ఘనంగా కుంకుమ పూజలు
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్వప్నలోక్ కాలనీలో ఆదివారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని మండపం వద్ద వినాయక నవరాత్రుల్లో భాగంగా కుంకుమ పూజలు, పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని వరద బాధితుల కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మళ్లీ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కాలనీ వాసులు పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : Chennai: గుండెపోటుతో కార్డియాక్ సర్జన్ మృతి
[…] Telangana: కామారెడ్డిలో ఘనంగా కుంకుమ పూజలు […]