కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను స‌స్సెండ్ చేయాలి: హ‌రీశ్‌రావు పిటిష‌న్

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజి మంత్రి హ‌రీశ్‌రావు మ‌రోసారి రాష్ట్ర ఉన్నత న్యాయ‌స్థానం(High Court)లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. గ‌తంలో మాజి సిఎం కెసిఆర్‌, హ‌రీశ్‌రావు హైకోర్టులో పిటిష‌న్‌లు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను స‌స్పెండ్ చేయాల‌ని హైకోర్టులో మ‌ధ్యంత పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అసెంబ్లీలో నివేదిక‌ను ప్ర‌వేశ‌పెట్ట‌కుండా చూడాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌స్తుతం ఈ పిటిష‌న్ హైకోర్టు రిజిస్ట్రీ ప‌రిశీల‌న‌లో ఉంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో త‌ప్పులు జ‌రిగిన‌వో లేదో తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టి కాదని.. కోర్టులు, ప్ర‌జ‌లు అని హ‌రీశ్ రావు పేర్కొన్నారు. వాస్త‌వాలు విన‌డానికి ప్ర‌స్తుత ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కాళేశ్వ‌రంపై పిపిటికి అవ‌కాశం ఇవ్వ‌టం లేదంటే.. అధికార ప‌క్షం భ‌య‌ప‌డుతుంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

1 Comment
  1. […] కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను స‌స్… […]

Leave A Reply

Your email address will not be published.