సికింద్రాబాద్‌లో స‌మైక్య‌త వ‌జ్రోత్స‌వాలను ప్రారంభించిన మంత్రి త‌ల‌సాని

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ జాతీయ స‌మైక్య‌త వ‌జ్రోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. రేపు తెలంగాణ జాతీయ స‌మైక్య‌త దినోత్స‌వంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ప‌తాక ఆవిష్క‌ర‌ణలు చేశారు. సికింద్రాబాద్‌లో వ‌జ్రోత్స‌వాల ర్యాలీని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌ యాద‌వ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌కవ‌ర్గాల‌లో మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం రాచ‌రిక వ్య‌వ‌స్థ నుండి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చి 75వ వ‌సంతంలోకి అడుగు పెడుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

Leave A Reply

Your email address will not be published.