తెలంగాణలో ఇక పాఠశాలలు ఉదయం 9.30కి ప్రారంభం..
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/school-exams-copy-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పాఠశాలలు ఇక నుండి ఉదయం 9.30 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4.15 గంటల వరకు.. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేయనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు విద్యాశాఖ అన్ని జిల్లాల డిఇఒలు, ఆర్‌జిడిఎస్ లకు పంపింది. ఈ మార్పులు తక్షణమే అమలయ్యే విధంగా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.