తెలంగాణ విద్యార్థుల‌ను హైద‌రాబాద్‌కు ఫ్రీగా తీసుకురావాలి: సిఎం కెసిఆర్

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉక్రెయిన్ నుండి ఢిల్లీకి చేరుకున్న భార‌తీయుల‌లో 28 మంది తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. రొమేనియా నుండి కొంత‌మందిని భార‌త్‌కు తీసుకొచ్చారు. వీరిలో 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. కాగా  ఉక్రెయిన్ నుండి వ‌చ్చిన వారిని ఉచితంగా తెలంగాణకు తీసుకురావాల‌ని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌ను ఢిల్లీలోని తెలంగాణ అధికారులు తెలంగాణ భ‌వ‌న్‌కు తీసుకెళ్లారు.

ఉక్రెయిన్ నుండి వ‌చ్చే తెలంగాణ వారి కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్మిన‌ల్‌-3 వ‌ద్ద ఏర్పాటు చేసిన డెస్క్‌, విద్యార్థుల‌కు స‌హాయ‌సహ‌కారాఉల అందిస్తోంది. ఈ డెస్క్ ద్వారా విద్యార్ధుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతో పాటు వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 20 మంది విద్యార్థులు..

 

Leave A Reply

Your email address will not be published.