త్వరలో తెలంగాణ టిడిపి అధ్యక్షుడి నియామకం.. ఎపి సిఎం చంద్రబాబు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో తెలుగుదేశం పార్టి అధ్యక్షుడిని త్వరలో నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నగరంలోని ఎన్‌టిఆర్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ ఎపిలో గత ఐదేళ్లలో జరిగిన విధ్యంసాన్ని సరి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో పార్టిని బలోపేతం చేయాలని అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేదు. అధ్యక్షుడిని కూడా నియమించలేదు. ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తానన్నారు. త్వరలో పార్టి రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తానని చంద్రబాబు అన్నారు. సామరస్యంగా మంచి వాతావరణంలో రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.