వరద బాధితుల కోసం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు రూ.15 కోట్ల విరాళం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ. 100 కోట్లు సిఎం సహాయ నిధికి అందించారు. ఇదేబాటలో ప్రైవేటు సంస్థలు కూడా విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఒక రోజు మూల వేతనం వదర బాధితుల సహాయార్థం విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల ఉద్యోగులు, పింఛనర్ల ఒక రోజు మూల వేతనం రూ. 15 కోట్లు సిఎం సహాయ నిధికి అందించనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జెఎసి వెల్లడించింది.