కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఇఆర్ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. దాదాపు ఐదు గంటల పాటు ఈ స‌మావేశం కొనసాగింది. సాగ‌ర్ కృష్ణా డేల్టా కింద సాగు, తాగు నీటి అవ‌స‌రాలు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే శ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తి చేయాల‌ని కెఇఆర్ఎంబీ చైర్మ‌న్ ఎంపీ సింగ్ స్ప‌ష్టం చేశారు. జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తిపై కెఇఆర్ఎంబీ నిర్ణ‌యంపై అసంతృఫ్తి వ్య‌క్తం చేసిన తెలంగాణ అధికారులు స‌మావేశం నుంచి వాకౌట్ చేశారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్‌ ఉత్పత్తి ఆపేది లేదని తేల్చి చెప్పింది. ఇరిగేషన్‌ లిఫ్ట్‌ పని చేసినప్పుడు మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని బోర్డ్‌ చైర్మన్‌ పేర్కొనగా.. ఈ వ్యాఖ్యలపై నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప‌ర‌స్ప‌ర ఫిర్యాదుల నేప‌థ్యంలో కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు 14వ స‌మావేశం ఇవాళ (బుధ‌వారం) కెఇఆర్ఎంబీ చైర్మ‌న్ ఎంపీ సింగ్ అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో జ‌రిగింది.

ఈ సమావేశం ముగిసిన అనంతరం కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం ప్రారంభమైంది.

Leave A Reply

Your email address will not be published.