రాజకీయాలపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు
విజయవాడ (CLiC2NEWS): మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి రాజ్యసభసీటు ఖాయమైందని వస్తున్న వార్తలపై గన్నవరం ఏయిర్‌పోర్టులో మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ.. రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమే అని స్పష్టం చేశారు. ఆ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను.. అలాంటి ఆఫర్లు నా వద్దకు రావు అని తేల్చి చెప్పారు. వాటిని కోరుకోనని చిరంజీవి తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని వెల్లడించారు.
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నిన్న మధ్యాహ్నం ఏపీ సిఎం జగన్ మోహన్‌రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది.