తెలుగు సినీ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/Rakesh-master-passed-away.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ తెలుగు సినీ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం సాయంంత్రం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం అనారోగ్యం బారినపడ్డారు. ఆదివారం ఉదయం బ్లెడ్ మోషన్స్ అవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
సివియర్ మొటబాలిక్ ఎసిడోసిస్ అవడంతో మల్లీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రాకేశ్ మాస్టర్ దాదాపు 1500లకు పైగా సినిమాలకు పనిచేశారు. ఈటివిలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షోలోనూ పలు ఎపిసోడ్స్‌లో నటించారు. ప్రస్తుతం తెలుగు సినిమా కొరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్‌తో పాటు పలువురు డ్యాన్స్ మాస్టర్లు ఆయనకు శిష్యులే. రాకేశ్ మాస్టర్ మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మఖు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.