కాంతార 2.. రిషబ్ శెట్టి ఆసక్తికర విషయాలు వెల్లడి

హైదరాబాద్ (CLiC2NEWS): రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో విడుదలైన కాంతారా సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సీక్వెల్‌పై రిషబ్ శెట్టి ఆసక్తికర విషయాలు తెలిపారు. కాంతార2 2024లో విడుదలవుతుందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇది కాంతారాకు సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని, తొలి సినిమాకు ముందు జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించాలనుకుంటున్నట్లు తెలిపారు. పంజర్లికి సంబంధించిన సన్నివేశాలు పార్ట్2లో ఉంటాయని తెలిపారు.