విజవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య!

విజయవాడ (CLiC2NEWS): విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని దుర్గమ్మ సన్నిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడం తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న (శుక్రవారం) అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చిన సదరు కుటుంబం కన్యకాపరమేశ్వరి సత్రంలోని ఒ గదిలో దిగారు. సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్యచేసుకోవాగా తండ్రి మరో కుమారుడు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను పప్పుల సురేష్ (56), పప్పుల శ్రీలత (54), ప్పుల అఖిల్ (28), ప్పుల అశిష్ (22)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.