కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
ఐసోలేషన్ వారం రోజులే..
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశం కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండు రోజులుగా 30 వేలకు పైగా నమోదైన కొత్త కేసులు.. ఇవాళ ఒక్కసారిగా 58 వేలకు చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 13,88,647 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58,097 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3.50 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు.
కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలతో ఇబ్బందిపడే బాధితులకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ సరించింది. ఇంతకు ముందు 10 రోజులున్న స్వీయ ఐసోలేషన్ కాలన్ని వారం రోజులకు కుదించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మూడు రోజుల జ్వరం రాకపోతే 7 రోజులు మాత్రమే హోం ఐసోలేషన్లో ఉండాలని కేంద్రం పేర్కొంది. అలాగే ఐసోలేషన్ ముగిసిన తర్వాత కొవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ వెల్లడించింది.
కొత్త మార్గదర్శకాలు..
- మూడు పొరల మాస్కులు ఎప్పుడు ధరించాలి. ఈ మాస్కును ప్రతి 8 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. ఉపయోగించిన మాస్కును ముక్కలుగా కత్తిరించి పడేయాలి.
- కుటుంబసభ్యులు ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తి దగ్గరకు వస్తే ఇద్దరూ ఎన్-95 మాస్కులను ధరించాలి.
- ఐసోలేషన్లో ఉన్న వ్యక్తి అధికంగా ద్రవపదర్థాలను ఆహారం తీసుకోవాలి
- కొవిడ్ లక్షణాలు లేని లేదా.. తక్కువ లక్షణాలు ఉన్న బాధితులు కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉండాలి.
- ప్రతి రోజూ మూడు సార్లు వేడి నీటితో గార్గిల్ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి.
- జ్వరం తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించి పారాసిటమాల్ బ్యాబ్లెట్లు వేసుకోవాలి.
- జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
- తరచూ ముక్కు, నోటిని చేతితో తాకడం వంటివి చేయకూడదు. ఐసోలేషన్ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.
- హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులు వరుసగా మూడు రోజుల జ్వరం రాకపోతే 7 రోజుల తర్వాత హోం ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. అయితే తర్వాత మాస్కు తప్పకుండా దరించాలి. ఐసోలేషన్ తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.