India Corona: 2 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో కొత్త కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా ల‌క్ష‌పైనే న‌మోద‌వుతున్న కొత్త కేసులు తాజాగా రెండు ల‌క్ష‌ల‌కు చేరువ‌య్యాయి. అలాగే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఐదువేల‌కు స‌మీపించాయి. అలాగే కొత్త‌గా క‌రోనా మ‌హ‌మ్మారితో 400కు పైగా మృత్యువాత ప‌డ్డారు.
గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 1,94,720 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం కేసులు 3,60,70,510కి చేరాయి. వీటిలో 3,46,30,536 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా 9,55,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో క‌రోనాతో 442 మంది మృత్యువాత ప‌డ్డారు. కొత్త‌గా 60,405 మంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.