ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లకు ఎక్కడివారక్కడే ఆగిపోవాలంటూ తెలిపింది. అక్కడి పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండాలని సూచించింది. ఉక్రెయిన్‌లో 22 వేలమంది భారతీయులు ఉన్నారని అధికార వర్గాల అంచనా. వీరిలో సుమారు వెయ్యిమంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు.
ఈనెల 25,26 తేదీల్లో భారత్‌కు వచ్చే విమానాలు రద్దయ్యాయి. రష్యా యుద్ధ ప్రకటనతో ఉక్రెయిన్ సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ దేశం ఎయిర్ స్పేస్ నిలిపివేసింది. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయు పౌరుల్ని తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం వెనక్కి మళ్లింది.
గురువారం ఢిల్లీకి చేరుకున్న విమానంలో కొందరు విద్యార్థులు, పౌరులు ఢిల్లీలో దిగారు. వీరిలో ఒక విద్యార్ధి మాట్లాడుతూ..ఉక్రెయిన్‌లో తామున్న ప్రంతం సరిహద్దుకు దూరంగా ఉంటుందని,అక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేదని చెప్పారు. భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాల ప్రకిరం తాము స్వదేశానికి వచ్చామని తెలిపారు. అయితే ఇదే తరహాలో మిగిలిన భారతీయులను తీసుకువచ్చేందుకు మరో విమానం బయలు దేరగా.. ఉక్రె యిన్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ఎయిరిండియా విమానం వెనక్కి వచ్చింది.