శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మ‌రో 11 మంది విద్యార్థులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉక్రెయిన్ నుండి మ‌రో 11 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా ముంబ‌యి చేరుకున్న వీరు శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. త‌మ పిల్ల‌ల‌ను చూసిన త‌ల్లిదండ్రుల భావోద్వేగానికి గుర‌య్యారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వదేశానికి తీసుకురావడానికి.. ఈ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేవిధంగా ప‌ర్య‌వేక్షించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ఉక్రెయిన్ పొరుగు దేశాల‌కు పంపింది. రొమేనియా, మాల్డోవాలో జ్యోతిరాదిత్య సింధియా, స్లోవేకియాలో కిర‌ణ్ రిజిజు, హంగ‌రీలో హ‌ర్‌దీప్ సింగ్‌, పోలాంగ్‌లో వీకే సింగ్ స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.