15-18 యేళ్ల వారికి కరోనా టీకా పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ (CLiC2NEWS): 15-18 సంవత్సరాల మధ్య వయసుకలిగి పిల్లలకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ సోమవారం నుండి ప్రారంభమైంది. వీరి కోసం ఈ నెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల మంది టీనేజర్లు వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరికి ఇవాళ్టి నుంచి డోసుల పంపిణీ మొదలైంది.
15-18 సంవత్సరాల పిల్లకు వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఆధార్ కార్డు లేని పిల్లలకు స్టూడెంట్ ఐడి కార్డు లేదా, జనన ద్రువీకరణ సర్టిఫికెట్తో నమోదు చేసుకోవచ్చని సర్కార్ ఇప్పటి కే ప్రకటించింది.