తెలంగాణలో మరో 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో మరో 1,663 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆర్ అండ్ బి శాఖల్లోని 1,522 ఇంజనీరింగా్ పోస్టులు సహా మొత్తం 1663 ఖాళీ పోస్టులు భర్తీకి ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల శాఖలో 704 ఎఇఇ పోస్టులు, 227 ఎఇ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భూగర్భ జలశాఖలో 88 పోస్టులు, రోడ్లు భవనాలశాకలో 38 సివిల్ ఎఇ పోస్టులు, 145 సివిల్ ఎఇఇ పోస్టులు, 13 ఎలక్ట్రికల్ ఎఇఇ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్ధికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్ఇచంది.