ఉక్రెయిన్ నుండి ఎపి విద్యార్థుల‌ను తీసుకొచ్చేందుకు సాయం చేయండి: సిఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఉక్రెయిన్ నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విద్యార్థుల‌ను సుర‌క్షితంగా భార‌త్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌కు ఎపి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ లేఖ రాశారు. ఉక్రెయ‌న్‌లో ర‌ష్యాదాడుల నేప‌థ్యంలో ఆదేశంలో ఉన్న భార‌తీయుల త‌ర‌లింపుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌శంసించారు. ఉక్కెయిన్‌లోని భార‌త ఎంబ‌సీని ఎపి విద్య‌ర్థులు సంప్ర‌దించాల‌ని జ‌గ‌న్ సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం ఎపి విద్యార్థుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూ అక్క‌డి ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తున్న‌ట్లు చెప్పారు. విద్యార్థుల‌కు సుర‌క్షితంగా తీసుకువ‌చ్చేందుకు కృషి చేయాల‌ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.