ఎపిలో కరోనాతో 11 మంది మృతి..
లక్షకు పైగా యాక్టివ్ కేసులు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 5,983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 11 మంది కరోనా మహమ్మారికి బలైనారు. గడిచిన 24 గంటల్లో ఎపిలో 35,040 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,622 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు బులెటెన్ విడుదల చేసింది.