తాడేపల్లిగూడెంలో దారుణం.. యువతి, కుటుంబసభ్యులపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది
తాడేపల్లిగూడెం (CLiC2NEWS): ఓ ప్రేమోన్మాది తన ప్రేమను అంగీకరించలేదని యువతితో పాటు ఆమె కుటుంబసభ్యులను సైతం విచక్షణా రహింతంగా కత్తితో దాడిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కొండ్రుప్రోలులో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ్రుపాలెం గ్రామంలో కూలి పనులు చేసుకుని జీవించే గాజులపాటి కల్యాణ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు దృష్టికి తీసుకువచ్చింది. యువతి తల్లిదండ్రులు కల్యాణ్‌ను పలుమార్లు మందలించారు. తన తీరు మార్చుకోక.. కల్యాణ్ యువతిపై కోపంతో గురువారం అర్ధరాత్రి యువతి కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణారహితంగా గాయపరిచాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. అడ్డువచ్చిన యువతి తల్లి, చెల్లెలు సైతం గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.