మాజి మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం..
ఆళ్లగడ్డ (CLiC2NEWS): మాజి మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ముందు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. నిఖిల్‌ను కారుతో ఢీకొట్టి.. మారణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్ దండగుల నుండి తప్పించుకొని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అనంతరం గాయాలతో ఉన్న నిఖిల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిఖిల్‌ను కారుతో ఢీకొట్టిన దృశ్యాలను అక్కడి సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.