కౌంటింగ్ రోజు పిన్నెల్లి మాచ‌ర్ల‌కు వెళ్లొద్దు.. హైకోర్టు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎన్నిక‌ల కౌంటింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి మాచ‌ర్ల‌కు వెళ్లొద్ద‌ని ఎపి హైకోర్టు ఆదేశించింది. పిన్నెల్లి ఎపి హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఉన్న‌త న్యాయ‌స్థానం శుక్ర‌వారం జారీ చేసింది. పిన్నెల్లి క‌ద‌లిక‌ల‌పై అంక్ష‌లు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు మాచ‌ర్ల‌కు వెళ్లొద్ద‌ని ఆదేశిస్తూ.. న‌ర‌స‌రావుపేట ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లొచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్ద‌ని, సాక్షుల‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని తెలిపింది.

పిన్నెల్లి క‌ద‌లిక‌ల‌పై పూర్తిస్థాయి నిఘా ఉంచాల‌ని.. పోలీసు అధికారుల‌కు సిఇఒ ఆదేశాలు జారీ చేయ‌ల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. జూన్ 6 వ‌ర‌కు పిన్నెల్లిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.