AP: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ఆర్డినెన్స్ జారీ

అమరావతి (CLiC2NEWS): ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ ఎపి సర్కార్ ఆర్గినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1 నుండి ఉత్తర్వులు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపెంపుకు మంత్రి వర్గ తీర్మానం అనంతరం గవర్నర్ కు పంపింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంబంధిత ఫైలుపై సోమవారం సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించనున్నారు.