నీట మునిగిన ముగ్గురు చిన్నారులు.. కాపాడబోయి మరొకరు మృతి

ములకల చెరువు (CLiC2NEWS): అన్నమయ్య జిల్లాలో నలుగురు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ములకల చెరువు మండలంలోని పెద్ద చెరువులో గల్లంతై ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. ఈశ్వరమ్మ అనే మహిళ బట్టలు ఉతికేందుకు పిల్లలతో కలిసి చెరువు వద్దకు వెళ్లింది. పిల్లలిద్దరూ ఆడుకుంటూ నీళ్లలోకి వెళ్లారు. వారితోపాటు మరో చిన్నారి కూడా చెరువులో గల్లంతైంది. చిన్నారును కాపాడేందుకు చెరువులోకి దిగిన ఈశ్వరమ్మ భర్త కూడా నీట మునిగి మృతి చెందాడు. నలుగురి మృతదేహాలను స్థానికులు బయటకు తీసుకొచ్చారు. భర్త , పిల్లలు మృతి చెందడంతో ఈశ్వరమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.