ఏలూరు: బాలుడిని హత్య చేసిన పదో తరగతి విద్యార్థులు ఆరెస్టు

ఏలూరు (CLiC2NEWS): వసతి గృహంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని.. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హత్యచేసిన ఘటన జిల్లాలోని బుట్టాయగూడెం పులిరాముడుగూడెంలో జరిగింది. వసతి గృహంలో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ జులై 10వ తేదీన బాలుడు హత్యకు గురైయ్యాడు. పదో తరగతి విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. విద్యార్థి హత్యకు గురవటంతో వసతి గృహంలో ఉండే విద్యార్థుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉర్రింకకు గ్రామానికి చెందిన గోగుల శ్రీనివాస రెడ్డి, రామలక్ష్మిలకు ఇద్దరు కుమారులు. పులిరాముడుగూడెంలోని వసతి గృహంలో హర్షవర్థన్ రెడ్డి ఆరో తరగతి, అఖిల్ వర్ధన్ రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నారు. అర్ధరాత్రి అంతా నిద్రపోతున్న సమయంలో ఇద్దరు లోపలికి వచ్చి.. అఖిల్‌ను బయటకు తీసుకెళ్లారు. బాలుడిని హత్యచేసి.. ‘బతకాలున్న వారు వెళ్లిపోండి, ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’ అని రాసి ఉన్న లేఖను చేతిలో పెట్టారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందుతులను ఆరెస్టు చేశారు.