కాకినాడలో దారుణం .. భార్యను నరికి చంపిన భర్త

కాకినాడ (CLiC2NEWS): నగరంలోని జగన్నాధపురం పప్పుల మిల్లు ప్రాంతంలో భర్త తన భార్యను అతికిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో బందుల నూకరాజుకు దివ్యతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం. గురువారం బయటకు వెళ్లి వచ్చిన నూకరాజు.. భార్య దివ్యతో గొడవపడి కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు అడ్డుగా వచ్చిన మరో మహిళకు గాయాలయ్యాయి. అనంతరం నూకరాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.