కళ్లముందే భర్త హత్య.. తట్టులేక గుండెపోటుతో భార్య మృతి

అనంతపురం (CLiC2NEWS): అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని జెఎన్‌టియుకు సమీపంలో లెక్చరర్ మూర్తిరావు గోఖలే ఆదివారం హత్యకు గురయ్యారు. కళ్ల ముందే భర్త హత్యను జరగడంతో తట్టుకోలేక అతని భార్య గుండెపోటుతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లెక్చరర్‌గా పనిచేస్తున్న మూర్తిరావు ఉద్యోగం ఇప్పిస్తానని తన మేనల్లుడి దగ్గరు డబ్బులు తీసుకున్నాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగి మేనల్లుడు ఆదిత్య.. మూర్తిరావును గొంతుకోసి హతమార్చాడు. అదిచూసిన మూర్తి రావు భార్య శోభ అదేరోజు రాత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.