ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారని కన్నతండ్రిని హతమార్చిన కూతురు

మదనపల్లె (CLiC2NEWS): తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటున్నారన్న కోపంతో ఓ యువతి తన కన్నతండ్రినే హతమార్చిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మదనపల్లెలో పి అండ్ టి కాలనీ లో ఈ నెల 13ర ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దొరస్వామి మదనపల్లె పి అండ్ టి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు బిఎస్‌సి బిఇడి చేసిన కుమార్తె ఉంది. కుమార్తె వివాహం కోసం తండ్రి కొంత మొత్తాన్ని ఆమె బ్యాంక్ అకౌంట్‌లోనే వేశారు. ఆమె తల్లి ఏడాది క్రితం చనిపోగా ఆమె నగలు సైతం కుమార్తెకు అప్పగించారు. అయితే ఆమె నగలను తన ఫ్రెండ్ రమేశ్‌కు ఇవ్వాగా.. అతను వాటిని తాకట్టు పెట్టి రూ. 11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సాయికృష్ణ అనే మరో యువకుడికి రూ. 8 లక్షలు నగదు ఇచ్చింది. అంతేకాక ఆమె హరీశ్ అనే అతనితో కూడా సన్నిహితంగా ఉంటోందని.. కూమార్తెను దారిలో పొట్టేందుకు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
పెళ్లి విషయంపై నెల రోజులుగా తండ్రి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 13వ తేదీన కుమార్తె తండ్రిపై దాడి చేసింది. అతని తలపై బలంగా కొట్టడంతో దొరస్వామి మృతి చెందాడు. పోలీసులకు తన తండ్రి కాలుజారి పడిపోయాడని తెలిపింది. తరువాత పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి అతని కూతురే హత్య చేసినట్లు నిర్దారించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.