బతికుండగానే తండ్రిని కాలువలో పడేసిన కుమారుడు..
దేహశుద్ఙి చేసిన స్థానికులు
పల్నాడు (CLiC2NEWS): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రబుద్ధుడు తన తండ్రిని బతికుండగానే కాలువలో పడేశాడు. ఈ ఘటన జిల్లాలోని ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద చోటుచేసుకుంది. నూజెండ్లకు చెందిన గంగినేని వెంటేశ్వర్లు తన తండ్రిని కారులో తీసుకొచ్చి బద్రుపాలెం వంతెనపై నుండి సాగర్ కాలువలో తోసేశాడు. అది గమనించిన స్థానికులు వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ పారిపోతున్న వెంకటేశ్వర్లుని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారమిచ్చారు. వృద్దుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.